ఎన్టీఆర్ జిల్లాలో కరవు మండలాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి గురువారం కేంద్ర బృందం చేపట్టిన పర్యటన గంటన్నరలో ముగిసింది.
రైతు సంక్షేమ విభాగం సహాయ కార్యదర్శి పంకజ్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర బృంద సభ్యులు తిరువూరు మండలం లక్ష్మీపురానికి మధ్యాహ్నం 2.30 గంటలకు రావాల్సి ఉండగా 5.15 గంటలకు వచ్చారు. పొద్దుపోయిన తర్వాత వచ్చిన కేంద్ర బృంద సభ్యులు పంట నష్టాన్ని చూడకుండానే వెళ్లిందంటూ అన్నదాతలు పెదవి విరిచారు.