మన్యంను చలిపులి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ గ్రామాలు గజగజ వణుకుతున్నాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక అరకులో 13, చింతపల్లిలో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. మంచు కమ్మేయడంతో వాహనదారులు బయటకు వెళ్లాలంటే రోడ్లు కనిపించని పరిస్థితి నెలకొంది.