ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉండనున్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. అందుకే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గం.45ని. వరకు పరీక్షల సమయంగా నిర్ణయించామని మంత్రి తెలిపారు. మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల తేదీలను విద్యా శాఖ ఖరారు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఉంటే.. రెండో రోజు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31 వరకు 12 రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9.30 నుంచి 12.45 నిమిషాలకు వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన వాతావరణం ఉందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విద్య కావాలో వద్దో తల్లిదండ్రులు చెప్పాలన్నారు. ట్యాబుల్లో పాఠాల కంటెంట్ కాకుండా వేరే వీడియోలు రాకుండా లాకింగ్ సిస్టం పెట్టామన్నారు. వాటీజ్ దిస్ నాన్సెన్స్ ఇంగ్లీష్ మీడియం పెడితే పేద పిల్లల మీద ఎందుకు ఇంత అక్కసు అంటూ ఆయన మండిపడ్డారు.