బైజూస్ కంటెంట్, ట్యాబులపై రామోజీ రావు ప్రముఖ పత్రికలో అశుద్ధమైన రాతలు రాశారని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తే తప్పేంటీ? అని నాగార్జున యాదవ్ సూటీగా ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల మీద రామోజీరావు విషం చిమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.