వైసీపీ ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతోందని వైసీసీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధానం కిడ్నీ సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారని చెప్పారు.
2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడని విమర్శించారు. ఉద్ధానం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? అని ప్రశ్నించారు.