బీసీ సీట్లలో నువ్వు, నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు-నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మర్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. ‘‘వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా?. ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు. ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు. చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.