ఇరాన్ దేశాన్ని సందర్శించేందుకు భారతీయులకు ఇకపై వీసా అవసరం లేదు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు, మొత్తం 32 దేశాలకు వీసా అవసరాల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు టెహ్రాన్ ప్రకటించింది.
ఇరాన్ భయాన్ని తొలగించి, పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ దౌత్యవేత్తలకు ఇప్పటికే వీసా రహిత యాక్సెస్ ఉండగా, ఇప్పుడు సాధారణ పౌరులకు కూడా వర్తిస్తుంది.