పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో కారు యాక్సిడెంట్లో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. భీమవరంలో ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనకు మద్ధతు తెలియజేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్ధిగా ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి సాబ్జీ గెలుపొందారు.