యాంటి నక్సల్ ఆపరేషన్‌లో పని చేసే వారికి 15 శాతం అలవెన్స్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కోర్టులలో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై కేబినెట్‌లో చర్చించారు. యాభై ఎకరాల లోపు ఉన్న 110 భూ కేటాయింపులను ఏపీఐఐసీకి కేటాయింపుపై చర్చ జరిగింది. ఏపీ స్టేట్ సీసీ టీవీ సర్వైవలెన్స్ ప్రాజెక్ట్‌కి రూ.552 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడంపై కూడా చర్చించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ‘ఆడుదాం ఆంధ్ర’పై కేబినెట్‌లో చర్చించారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు 982 తాత్కాలిక పోస్టులు అదనంగా క్రియేట్ చేయడంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి విజయవాడ లోని రాయనపాడులో 20 సెంట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జగన్న శాశ్వత భు హక్కు, భూ రక్ష పథకం కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.