పశ్చిమ గోదావరి జిల్లా, నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గ్రామానికి చెందిన కోరు ఏసుబాబు (45) నూజివీడు నుంచి ఏలూరు వైపు బైక్‌పై వెళ్ళుతున్నాడు. ఈ క్రమంలో ముసునూరు పరిధిలో దేవినేని ఉమామహేశ్వరరావు పామాయిల్ తోట వద్ద ఉన్న మలుపులో ప్రమాదవశాత్తు బైక్ రహదారి మార్జిన్లోకి దూసుకుపోడంతో ఏసుబాబు తీవ్ర గాయాలపాలై అక్కడకక్కడే మృతి చెందాడు. ముసునూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడి సెల్ఫోన్లో నంబర్లు ఆధారంగా అతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు హెడ్‌కానిస్టేబుల్ అజయ్‌బాబు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.