కడప జిల్లా,గుర్రంకొండ మండలంలోని మర్రిపాడు ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలం టూ ప్రజలు ఖాళీ బిందెలతో గురువారం నిరసన తెలియజే శారు. ఈ సందర్భంగా కాల నీ ప్రజలు మాట్లాడుతూ ప్రజ ల దా హార్తి తీర్చడానికి వేసిన బోరు వారం రోజుల క్రితం మర మ్మతులకు గురైందని ఈ క్రమంలో తాగు నీటి కోసం పడరానిపాట్లు పడుతున్నామన్నా రు. నీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మన్నారు. తాగు నీటి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అంతేకాకుండా పంచాయతీలో నిధులు లేవని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు బోరు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తాగు నీటి బోరుకు మరమ్మతు లు చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.