ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. బంగాళదుంపకు ఉల్లిగడ్డకు తేడా తెలియని జగనన్న డిపాజిట్లు అంటే ఇవేనా అని ప్రశ్నించారు. 2014లో తమరు తెలంగాణలో పోటీ చేస్తే తమరికొచ్చిన ఓట్లు కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉన్నాయనే సంగతి మరచితిరా జగనన్న అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఆనాడు తెలంగాణలో రాళ్ళతో తరిమి తరిమి కొట్టిన రోజులు మరిచితిరా.. దివంగత నేత ముద్దుల బిడ్డవి కదా, ఆనాడు కొల్లాపూర్‌లో మీకు వచ్చిన ఓట్లు 1204 (0.81%)... 2023లో స్వంతం అభ్యర్థి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు 5,754 (2.99%)..., ఇది కదన్న తెలంగాణలో మన చరిత్ర.. మళ్ళీ మనమెందుకన్న ఎదుటివాళ్ళ వైపు వేలు చూపించడం... గురివింద గింజ మాటలు చెప్పడం ఇప్పటికైనా మానుకోండన్న జనాలు నవ్వుతుండ్రు’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.