విజయనగరం జిల్లా, పాచిపెంట మండలంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన గండి రామకృష్ణ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలో ఉన్న తన పొలంలో మందుకొట్టేందుకు బుధవారం సాయంత్రం వెళ్లాడు. పొలానికి మందు కొడుతుండగా విద్యుత్ మోటార్ కోసం ఏర్పాటు చేసిన వైరు కాలికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మృతుడి భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ పి.నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.