రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు రక్షణ లేదని, ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ పాణ్యం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గౌరుచరిత మాట్లాడుతూ..... టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా నిర్వహించారన్నారు. సీఎం జగన్ కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారయన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులుపెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. 2024లో టీడీపీ, జనసేన సమష్టి ప్రభుత్వం రాబోతోందని అన్నారు.