రాష్ట్రంలో రైతులు ఆకాల వర్షాలతో, పంట నష్టాలతో అతాలాకుతలం ఆవుతుంటే తాడేపల్లెలో కొలువుతీరే సీఎం జగన్‌రెడ్డికి రైతుల కష్టాలు ఏలా తెలుస్తాయని గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా బేస్తవారపేట మండలం పిటికాయగుళ్ల పంచాయతీలో జరిగిన కార్యాక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతో కలిసి పర్యటించిన అశోక్‌రెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు మహిళలకు అందజేసి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం బహిరంగ సభలో వారు మాట్లాడారు. నాడు టీడీపీ హాయంలో రైతులకు పెట్టుబడి సహాయనిధి నుండి గిట్టుబాటు ఽధరలు కల్పించడం వరకు చంద్రబాబు భరోసాగా ఉన్నారని గుర్తుకు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు అన్నదాత పథకం ద్వారా ఏటా రూ.20వేలు అందజేస్తా మన్నారు. రాష్ర్టానికి మంచిరోజులు కావాలంటే టీడీపీ, జనసేన, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటక నరశింహ, నారా వెంకటేశ్వరరెడ్డి, చేగిరెడ్డి పోతిరెడ్డి,నర్రా బలరామిరెడ్డి,నర్రా వెంకట రమణారెడ్డి,బల్లా రామచంద్రారెడ్డి,చేగిరెడ్డి రామిరెడ్డి,పోతిరెడ్డి,రాచకొండ శివయ్య, సూరేబోయిన గురుచంద్రుడు, దూదెకుల చిన్న మస్తాన్, హుస్సేన్,తాళ్ళ శ్రీనివాసరెడ్డి, ఉండేలా వెంకటనారాయణరెడ్డి,షేక్ అబ్ధుల్లా, ఆవుల శ్రీనివాసరెడ్డి, జనసేన నుండి లంకా నరశింహరావు, ముంత మధుసుధన్‌రెడ్డిదమ్ము తిరుపాలు తాడివెట్టి ప్రసాద్,మాచర్ల విశ్వనాధరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.