చిత్తూరు జిల్లా, పలమనేరు, రామకుప్పం మండలాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. పలమనేరు మండలం గుండ్లపల్లి, శ్రీరంగరాజపురం గ్రామాల్లో వేరుశనగ పంటను కేంద్ర కరువు పరిశీలన బృందం (మినిస్టీరియల్ సెంట్రల్ టీం) పరిశీలించి.. రైతులతో మాట్లాడింది. రైతుల అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఈ బృంద సభ్యుడు.. కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ పి.దేవేంద్రరావు హామీ ఇచ్చారు. జేసీ శ్రీనివాసులుతో కలిసి బృంద సభ్యులు దేవేంద్రరావు, ఎస్టీయే రీజనల్ ఫాడర్ స్టేషన్ అంజు బసెరా, ఎంఎన్‌సీఎ్‌ఫసీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పాల్గొన్నారు. మండలంలో కరువు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఇక్కడి సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. పలమనేరు, గంగవరం, రామకుప్పం, రొంపిచెర్ల మండలాలను కేంద్రం కరువు మండలాలుగా గుర్తించిందన్నారు. వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోతున్నారని, శాశ్వత నీటి వసతి లేదని కేంద్రబృందానికి జేసీ వివరించారు. జిల్లాలో ఖరీ్‌ఫ2023కు 51,266 హెక్టార్ల వేరుశనగ పంట లక్ష్యం కాగా వర్షాభావ పరిస్థితులతో 15,038 హెక్టార్లలో మాత్రమే సాగైందన్నారు.