ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికారిక ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయడం లేదని శుక్రవారం మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు. 'కొన్ని రోజులుగా నేను నా ఫేస్బుక్ పేజీని యాక్సెస్ చేయలేకపోతున్నాను. అది హ్యాక్ చేశారు. వీలైనంత త్వరగా దాన్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం' అని మేయర్ ఒబెరాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.