ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇంటింటికీ జగన్ సర్కార్ మందులు పంపిణీ చేయనుంది. ఈ నెల 18న కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లోబోయిన వేణు అధికారిక ప్రకటన చేశారు. నిన్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ మెరుగైన ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 25 లక్షలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను పంపిణీ చేస్తాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు చేశాం.. ఆరోగ్యశ్రీ అవగాహన, ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వారికి రవాణా ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్న వారికి ఇంటింటికీ మందులు అందజేస్తామని మంత్రి చెల్లోబోయిన వేణు తెలిపారు.