కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం వద్దజరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలు అయ్యాయి. మృతుడు కొండాపురం మండలం ముచ్చు మర్రి గ్రామానికి చెందిన కొండు నాగ సుబ్బారెడ్డిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్ళితే.... పెళ్లి బస్సులు కొండాపూరం నుంచి వేంపల్లికు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులు ఒకదాని వెనక మరొకటి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.