కృష్ణా జిల్లా, ప్రసాదంపాడులో టీడీపీ నాయకులు, ఉపసర్పంచ్ నరసయ్య ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నరసయ్య కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. నిన్న ప్రసాదంపాడులో గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ & జనసేన విసృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన నాయకులు భారీగా హాజరయ్యారు. సమావేశంలో ప్రసాదంపాడు టీడీపీ ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య కీలకంగా వ్యవహరించారు. దీనితో అక్కసుతో దాడికి పాల్పడి ఉంటారని టీడీపీ నేత గూడవల్లి నరసయ్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు.