పెద్దపప్పూరు మండలంలోని చిన్న పప్పూరు గ్రామ సమీపంలోని అశ్వర్థ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు సుధీర్ కుమార్ శర్మ, బాలసుబ్రమణ్యం శర్మ పేర్కొన్నారు. ధనుర్మాస సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీ అశ్వర్థ నారాయణస్వామి, వినాయకుడు, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించామన్నారు.