న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం అంగన్వాడి వర్కర్లు గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ఎన్టిఆర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియూ మాజీ జిల్లా కార్యదర్శి డి. శ్రీనివాసులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కసాపురం రమేష్, సాకే నాగరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకురాల్లు రేష్మా, గంగా తదితరులు పాల్గొన్నారు.