రేపల్లె రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 8 అర్జీలు వచ్చినట్లు ఆర్డిఓ హేలా షారోన్ తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించినట్లు ఆర్డీవో తెలిపారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ హెచ్చరించారు.