మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా నివాసాలు వేసుకుని ఉంటున్న 20వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేవరకు ఆందోళనలను ఉదృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి. కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరాహార దీక్షలు సోమవారంకి 3వ రోజుకు చేరాయి.
శిబిరాన్ని కృష్ణయ్య ప్రారంభించి మాట్లాడుతూ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థంకావడం లేదన్నారు.