తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతూ ఈనెల 21 , 22 తేదీల్లో సచివాలయాలు వద్ద జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య పిలుపునిచ్చారు.
సోమవారం మంగళగిరి రైతు సంఘం కార్యాలయంలో రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాల జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు.