చంద్రబాబుకు వత్తాసుపలికే ఎల్లోమీడియా పైత్యం రోజురోజుకు శృతిమించి పోతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. అత్యంత పారదర్శక పాలనతో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని, వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో అంశాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతోందన్నారు. చంద్రబాబు, పవన్ మధ్య జరిగినవి ప్యాకేజీ చర్చలని, ప్యాకేజీపై దత్తపుత్రుడు అలకబూనితే.. చంద్రబాబు రాయబారం కోసం వెళ్లారంటూ ఎద్దేవా చేశారు.