మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 22 నుంచి 26 వరకూ ఐదు రోజుల పాటు చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లోని అన్ని పంచాయతీల్లో ప్రజలతో మమేకం కానున్నారు. సోమవారం మడకశిర నియోజకవర్గ పరిశీలకులు అశోక్ కుమార్, మంత్రి వ్యక్తిగత వ్యక్తి సహాయకుడు చంద్రహాస్, నియోజకవర్గ నేత వేణురెడ్డి చిలమత్తూరు మండలంలో పర్యటించారు. సమన్వయంతో మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.