ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్షకట్టి ఉక్కు పాదం మోపడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ, పెట్టుబడిదారి విధానాలకు నిదర్శనమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మోసం చేశారన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే అధికారం జగన్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.