నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆపై వాహానాల్లో ఆయనను ఇంటికి తరలించారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి సుమారు 200 మంది హిజ్రాలు, వైసీపీ గూండాలను అక్రమార్కులు పంపారు. క్వారీలో ఉన్న భారీ యంత్రాలు, వాహానాలను బయటకి పంపేయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు జరిగి.. ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను బయటకి పంపారు. వైసీపీ గూండాలకు పోలీసులు సపోర్డు చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.