శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు. 27 రోజుల్లో రూ.4.24 కోట్ల ఆదాయం వచ్చింది.
670 గ్రాముల బంగారం, 8.150 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. ఇ-హుండీ ద్వారా రూ.1,31,417 కానుకలను భక్తులు సమర్పించారు. 865 యూఎస్ డాలర్లు, 75 ఇంగ్లాండ్ పౌండ్లు, డాలర్లను భక్తులు హుండీలో వేశారు.