చిరుతపులి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. నెహ్తౌర్ ప్రాంతంలోని బధివాలా గ్రామానికి చెందిన నైనా (9) తండ్రిని కలవడానికి పొలానికి వెళ్లింది. నది ఒడ్డున వెళ్తుండగా బాలికపై చిరుతపులి దాడి చేసింది.
బాలిక అరుపులు విన్న స్థానికులు గట్టిగా అరవడంతో చిరుతపులి అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలికను ధాంపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.