చైనాలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 116 మందికిపైగా మృతి చెందగా.. 400 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ భూకంప ధాటికి ఇప్పటివరకు 6,381 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఎల్లో రివర్‌పై వంతెనకు బీటలు వారింది. ప్రస్తుత విపత్తు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రంగంలోకి దిగారు. అధికారులను అప్రమత్తం చేసి.. సహాయక చర్యలు చేపట్టారు.