ఎల్. ఎన్. పేట మండలంలో అధికారులు, మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతులు ధాన్యం ట్రాక్టర్లతో ఏబి రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. దీంతో కి. మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది.
ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకు గ్యారంటీలు వచ్చిన వెంటనే వేరే మండలాలకు చెందిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి మండలానికి చెందిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేవరకు ధర్నా చేస్తామన్నారు.