కర్ణాటక దావణగెరె శివార్లలోని ఓ గ్రామంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. గ్రామంలో ఓ మహిళ ఇంటికి డీహెచ్ మంజప్ప (48) అనే వ్యక్తి వచ్చాడు. తనకు అన్నంలోకి ఊరగాయ పచ్చడి కావాలని అడిగాడు.
ఈ క్రమంలో మహిళను కౌగలించుకుని, ఆమె బుగ్గ కొరికాడు. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో పారిపోయాడు. గతంలో చుట్టు పక్కల గ్రామాల్లో ఇదే తరహాలో నిందితుడు చేశాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.