విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బాటలు వేస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని అంబటి రాయుడు చెప్పారు. ‘ఆడుదాం–ఆంధ్ర’లో ప్రతి విద్యార్థి, యువత పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, వైయస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెద్దబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి భరత్‌రెడ్డి, ఏలూరు అధ్యక్షుడు ఏలూరు అంజి, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ వైఎన్వీ శివరావు తదితరులు పాల్గొన్నారు.