అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని కలవకూరు రోడ్డులో ఉన్న ఇటుక బట్టీల వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు వెంకాయమ్మ వెంకటనారాయణ లు అద్దంకి వస్తుండగా ఇటుక బట్టీల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.