రేపు ముఖ్యమంత్రి పదవి పోయినా వెంటనే జగన్పై ఉన్న కేసుల విచారణ మొదలవుతుందని, కాబట్టి అడ్డగోలుగా జగన్ అధికారం చేపట్టాలని ఆలోచన చేస్తున్నాడు కానీ అదే జరిగే అవకాశం లేదని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు వాపోయారు. జగన్ వైనాట్ 175 అనడం కాదు, వైనాట్ పులివెందుల అని తాము అంటున్నామన్నారు. పులివెందులలో గెలిచి నిరుపించామని.. పులివెందుల వాసి రాంగోపాల్ రెడ్డి పులివెందుల్లో కూడా మెజార్టీతో ఓట్లు సాధించి గెలిచారన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల ప్రాతినిధ్యంలో మూడు ఎమ్మెల్సీ స్థానలు గెలిచి రుజువు చేశామన్నారు. చంద్రబాబుపై జగన్ పెట్టిన కేసులన్ని చిత్తుకాగితలతో సమానమన్నారు.ఇప్పటికే అధికారుల్లో కూడా మార్పు వచ్చిందని తాము నమ్ముతున్నామని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.