రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాబురావు విమర్శించారు.ఆయన మాట్లాడుతూ..... సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారన్నారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫీయాలతో పాటు, ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని ఆరోపించారు. నాయకులు నీలకంఠ, దిలీప్ ధోకా, మారుతి రావు, ఎంఎండీ నూర్, సాయినాథ్, దేవిశెట్ట వీరేష్, పాల్గొన్నారు.