పుంగనూరు మండల పరిధిలోని చండ్ర మాకుల పల్లె గ్రామానికి చెందిన వెంకటేష్ (23) ఆన్లైన్ లో బెట్టింగులకు పాల్పడి ఆరు లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పుల పాలు కావడంతో మనస్తాపం చెందిన వెంకటేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు జరిపి అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.