ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు యువగళం ముగింపు సభలో చంద్రబాబు ఎన్నికల శంకరావం పూరించనున్నారని తెలిపారు. జగన్పై ఉన్న కేసులకు ఒక్కసారి విచారణ మొదలైతే జీవిత ఖైదు తప్పదన్నారు. ముఖ్యమంత్రి పదవి కేవలం జగన్పై కేసుల విచారణ ముందుకు జరగకుండా ఉపయోగపడుతుందన్నారు. ఆరు కోట్ల అవినీతి కుంభకోణంలో గతంలో జయలలిత జైలు పాలయ్యారని గుర్తుచేశారు. జగన్పై 43వేల కోట్ల అవినీతి చేసిన అధరంగా 12 చార్జ్ షీట్లు ఉన్నందున జగన్ శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.