తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు.. మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు.
ఇందుకు సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు.