ఉత్తర కొరియా తయారు చేసిన హ్వసాంగ్-18 అనే అధునాతన, శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మూడో దశ పరీక్షను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ..అమెరికా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఉ. కొరియా ఎలా స్పందిస్తుందో హ్వసాంగ్-18 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష చూపించిందని అన్నారు. ఉ.కొరియా అధికారిక మీడియా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.