ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేశారు. రైతులకు మద్దతుగా ఆందోళన చేసిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై 341,188 ఐపీసీ సెక్షన్ల కింద ఉరవకొండ అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హంద్రీనీవా నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు సాగు నీటిని ఇవ్వాలంటూ ఆందోళన చేసిన పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయడం ఏంటంటూ రైతులు మండిపడుతున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదన్నారు. రైతులకు హంద్రీనీవా నుంచి గుంతకల్ బ్రాంచ్ కెనాల్‌కు నీటిని ఇచ్చే వరకూ రైతులు, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తామంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa