రాష్ట్రంలో నేటి నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే పారిశుధ్య సిబ్బంది సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని పారిశుధ్య కార్మికుల డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కరించకపోతే 27 నుంచి సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఇప్పటికే నిరవధిక సమ్మెలో అంగన్వాడీలు ఉన్నారు.