లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరిలో భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రెస్ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ భారత్ జోడో యాత్ర 2.0 రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగనుంది.
తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు కూడా భారత్ జోడో యాత్ర వంటి ర్యాలీని నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత తెలిపారు. దీని కోసం 2 మార్గాలను కాంగ్రెస్ అన్వేషిస్తుంది. దీని ద్వారా దేశ సామరస్యతను పెంపొందిస్తున్నామని చెప్పారు.