నెల్లూరు జిల్లా,సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు మంగళవారం భూ పట్టాల పంపిణీ అందచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగినేని శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సైదాపురం గ్రామ సచివాలయం-1లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. తదుపరి క్రీడాకారులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్, జేసీఎస్ మండల కన్వీనర్ శ్రీనివాసులు రాజు, వైస్ ఎంపీపీ భాస్కర్, పీఏసీఎస్ అధ్యక్షుడు గోగినేని శివకుమార్ నాయుడు, సర్పంచు శారద, ఉప సర్పంచు బొలిగర్ల శివకుమార్, వరదబండి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.