కోవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి కృష్ణబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని వెల్లడించారు.
కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని అన్నారు. విలేజ్ క్లినిక్లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని చెప్పారు.