పెనుకొండ మండలంలోని కియా పోలీస్ స్టేషన్ ను బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తో కలిసి డి ఐ జి అమ్మి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సిబ్బంది పనితీరు రికార్డులు, కేసులు పురోగతి పై డి ఐ జి ఆరాదీశారు. స్టేషన్ ఆవరణాన్ని, స్టేషన్ లోని రిసెప్షన్, లాకప్, కంప్యూటర్ గది, రైటర్ గది పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి హుస్సేన్ పీరా, సిఐ రాజా రమేష్, ఎస్సై రమేష్ బాబు పాల్గొన్నారు.