పెద్దపప్పూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సచివాలయం-2 లబ్దిదారులకు బుధవారం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్డులు అందించారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరామిరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.