అనుమతులు లేని ఎరువులు పురుగుల మందులు విక్రయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉరవకొండ మండల వ్యవసాయ అధికారి శుభకర్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో ఎరువులు, పురుగుల మందులు నిల్వలు వాటి అమ్మకాలు గల అనుమతులు, బిల్లులు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే దుకాణాల నుండి పరీక్షల కోసం వివిధ రకాల శాంపుల్ తీసుకున్నారు.